గచ్చిబౌలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేడు అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు ఏర్పాట్లు


హైదరాబాద్‌: గచ్చిబౌలిలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


నిన్న గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేవలం 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


కూలిన భవనం పక్కనే ఉన్న జయదర్శి అపార్ట్‌మెంట్‌ను నేడు కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం నిర్మాణం, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది.


భవన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న సాజిద్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
గచ్చిబౌలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేడు అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు ఏర్పాట్లు హైదరాబాద్‌: గచ్చిబౌలిలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేవలం 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఉన్న జయదర్శి అపార్ట్‌మెంట్‌ను నేడు కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం నిర్మాణం, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది. భవన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న సాజిద్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
0 Comments 0 Shares 175 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com