🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నదీమ్ ఖుద్దుసి తెలిపారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి,...