Bharat Aawaz
బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ భారీ ఆపరేషన్‌.. 14 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుర్గాప్రసాద్‌, రవి, కిరణ్‌ అనే ముగ్గురు అన్నదమ్ములు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీరితో పాటు కమలాకర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈగల్‌ టీమ్‌ సోదాలకు వచ్చిన సమయంలో నిందితులు పోలీసులపైకి కుక్కను వదిలి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కుక్కను అడ్డుపెట్టుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా.. ఈగల్‌ టీమ్‌ వారిని పట్టుకుంది. నిందితుల ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గంజాయి సరఫరా వ్యవహారంపై పోలీసులు మరింత విచారణ చేపట్టారు.
163 Views