మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి వినమ్ర నివాళులర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశేష కృషి చేసి, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి పాత్ర చిరస్మరణీయమని స్మరించుకున్నారు.


రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా వారు చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభకు, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి వినమ్ర నివాళులర్పించారు. భారత అంతరిక్ష, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశేష కృషి చేసి, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి పాత్ర చిరస్మరణీయమని స్మరించుకున్నారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా వారు చూపిన నిబద్ధత, నిరాడంబర జీవనం, అసాధారణ ప్రతిభకు, అచంచలమైన దేశభక్తికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
0 Comments 0 Shares 260 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com