🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ లోని ఇటీకాలలో రోడ్డుపై పేరుకుపోయిన బురదను తొలగించి, రోడ్డుకు రెడీ మిక్స్ కంకర వేయించే పనులను గ్రామ సర్పంచ్ శ్రీ సత్ర వేణి రాజన్న దగ్గరుండి చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై బురద ఎక్కువగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు విన్నవించారు.గ్రామస్థుల అభ్యర్థన మేరకు...