Bharat Aawaz
హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు. టూ-వీలర్ వాహానదారులకు అవగాహన కల్పించిన అల్వాల్ ట్రాఫిక్ ఎస్. హెచ్.ఓ.

టూ-వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, భద్రత గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అల్వాల్ Tr PS లోని సుచిత్ర సర్కిల్ వద్ద "ఏఆర్ రోడ్ సర్వే ప్రైవేట్ ఇండియా" సమన్వయంతో.....హెల్మెట్ ధరించకుండా టూ-వీలర్ నడిపేవారికి ISI మార్క్ గల 50 హెల్మెట్‌లను ఆల్వాల్ ట్రాఫిక్ పి.యస్. ఎస్.హెచ్.ఓ. ఏ.నాగరాజు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టూ-వీలర్ లు నడిపేవారు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు. హెల్మెట్ ధరించడం అనేది మీ తలపై ప్రమాదం యొక్క గాయాల తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీరు టూ- వీలర్ నడుపుతున్నప్పుడు, మీరు ప్రమాదానికి గురైతే.. మీరు హెల్మెట్ ధరించకపోతే తలకు జరిగే గాయాలు ప్రాణాంతకం కావచ్చు. హెల్మెట్ ధరించక పోవడం వల్ల ఆ ప్రమాదంలో తలకు బయటగాని, అంతర్గత మెదడుకు గాని గాయాలు కావచ్చు. ఇది మీ జీవితాన్నే ప్రమాదంలో పడవేస్తుంది. అందువల్ల తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో మీ జీవితాన్ని మీరు కాపాడుకున్నట్టే. అంతేకాకుండా ప్రమాదం యొక్క తీవ్రత చాలావరకు తగ్గుతుంది. అలాగే మీరు ట్రాఫిక్ నియమాలు పాటించిన వారవుతారు.. అని టూ- వీలర్ వాహనదారులకు వివరించారు.
400 Views