Bharat Aawaz
₹59 లక్షల రూపాయల జి.హెచ్.ఎం.సి నిధులతో సీసీ రోడ్డు మరియు భూగర్భ డ్రైనేజి పనులు ప్రారంభించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్.

ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ..
ఈ రోజు శుభదినం. శ్రీ హనుమత్ జయంతి రోజున, శ్రీభ్రమరాంబికానగర్, ఆనందబాగ్ అష్ట భుజా దేవి అమ్మవారి దేవాలయం వద్ద జి.హెచ్.ఎం.సి అధికారులు, స్థానికులతో కలిసి దాదాపు ₹59 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా ప్రత్యేక అనుమతులతో వాటర్ వర్క్స్ నుండి కాకుండా జి.హెచ్.ఎం.సి నుండి భూగర్భ డ్రైనేజ్ నిధులు తీసుకొచ్చామని అన్నారు.
ఇందుకు సహకరించిన కమీషనర్ గారికి శ్రవణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు.
ఈ కార్యక్రమం లో జి.హెచ్.ఎం.సి. ఏ.ఈ. నవీన్, రమేష్, గిరి. కాలనీ వాసులు శ్రీనివాస్, సుధాకర్, అనంత్, నాని,నర్సింహా,రంగ నాథన్, లీలావతి, రవి,జైకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
362 Views