Bharat Aawaz
రాజీవ్ గాంధీ వర్ధంతి... కాంగ్రెస్ నేతల నివాళి.

స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకుని ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... ఇందిరాగాంధి మరణానంతరం రాజీవ్ గాంధీ 40 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి అయ్యాడు. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవబాంబు దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. ఆయన వర్ధంతి రోజుని జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజీవ్ మరణంతో దేశం యువ నాయకున్ని కోల్పోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టం కలిగిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
Like
2
1.1K Views