అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో అగ్నివీర్గా ఎంపికయ్యాడు. ఆయన ఎంపికపై తాండావాసులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కృషి, గురువుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని అనిల్ తెలిపాడు. ఈ సందర్భంగా పలువురు అనిల్ కుమార్ను ఘనంగా అభినందించారు.
0 Comments 0 Shares 347 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com