ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలు


ఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి చర్చలు


హైదరాబాద్ :

IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.


ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్‌గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.


అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.


ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.


ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.


ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలుఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి చర్చలుహైదరాబాద్ :IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్‌గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.
0 Comments 0 Shares 238 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com