భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని ముక్కోణపు పార్క్ వద్ద ఆయన విగ్రహానికి చీరాల జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి అంబేద్కర్ సిద్ధాంతాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన మహత్తర సేవలను స్మరించుకున్నారు.
అనంతరం చీరాల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులు, యువత పెద్ద...