శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పుండరీకుకు శనివారం వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. కిషోర్ కుమార్ వెల్లడించారు. వేతన సవరాలు కమిటీ ఏర్పాటుచేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments 0 Shares 99 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com