పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య...
భద్రాచల శ్రీరాముల వారి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. తరువాత పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలతో స్వామివారికి రాజ లాంఛనాలు అలంకరించి పట్టాభిషేకం జరిపారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలతో పాటు విష్ణు పురాణం, భగవత్ శాస్త్ర పారాయణాలు జరిగాయి. పుష్కర జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ, హారతులు సమర్పించారు.
0 Comments 0 Shares 442 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com