చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి...