హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.
❇️ ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
❇️ జల మండలికి కేటాయింపులు రద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, గారు పీఠం ప్రతినిధులకు సూచించారు.

74 Views