Gk:
వేట్లపాలెం పేలుడు ఘటన: 23కి చేరిన మృతుల సంఖ్య
కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి పెరిగింది.
గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రసాయనాల నిల్వ, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్లు సమాచారం.
విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.
పేలుడు చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, సహాయక చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చి, ప్రభుత్వ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వనున్నారు.

0 Comments
0 Shares
333 Views
0 Reviews