Bharat Aawaz
[28/02, 12:32 pm] null: ఇరాన్‌పై క్షిపణి దాడులు: అప్రమత్తమైన ఇజ్రాయెల్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించిన ఇజ్రాయెల్, దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయ కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
దాడుల అనంతరం ఇజ్రాయెల్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఇరాన్ నుంచి అధికారిక ప్రతిస్పందన కోసం అంతర్జాతీయ సమాజం ఎదురుచూస్తోంది. పరిస్థితులు మరింత విషమించే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
[28/02, 12:59 pm] null: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించాయి. “షీల్డ్ ఆఫ్ జూద్” పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.
సుమారు 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిసినట్లు సమాచారం.
దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు విదేశీ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తోంది.
75 Views