[27/02, 12:57 pm]
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: కేజ్రీవాల్, సిసోడియాకు క్లీన్ చిట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కీలక ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాను కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో మెరిట్ లేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అభియోగాలను నిర్ధారించే విధంగా ఎలాంటి పక్కా ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, సిసోడియాలకు క్లీన్ చిట్ ఇస్తూ డిశ్చార్జ్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుతో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణలో వచ్చిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
[27/02, 12:59 pm]
: “నిజం గెలిచింది.. రాజకీయ కుట్రే”: కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి బయటకు వచ్చిన అనంతరం బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “నిజం గెలిచింది.. కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను” అని తెలిపారు.
తనపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కుట్రేనని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావును టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. “మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ చివరకు నిజం వెలుగులోకి వచ్చింది” అని అన్నారు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు, అత్తామామలు కష్టకాలంలో అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. “నాకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను” అని కవిత స్పష్టం చేశారు.
కేసు పరిణామాల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

41 Views