చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ ఆటోలో ప్రయాణించి సంఘం థియేటర్ వద్ద దిగింది. దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టు తాడు ఆటోలోనే చేజారిపోయింది.బాధితురాలు జంగిలి లక్ష్మి, జాండ్రపేట సీతానగరం రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్నారు. తాను ప్రయాణించిన ఆటోలో తాళిబొట్టు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె ఆందోళనకు...