Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం.
    మదనపల్లె పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇడ్లీ పాత్రలు, ప్లేట్లలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని, వాటికి బదులుగా అరిటాకులను మాత్రమే ఉపయోగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై భారీ జరిమానాలు విధించి, మూసివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
    262 Views
  • బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
    మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు అర కిలోమీటరు దూరం నుండి నీటి క్యాన్లను మోయించుకుంటూ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్మార్గపు చర్యపై విద్యాశాఖ అధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చోటుచేసుకుం.
    252 Views
  • మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.
    ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పుంగనూరుకు చెందిన యేసు, విడాకులు తీసుకున్న తన మాజీ భార్య నీలిమ పేరిట ఉన్న ఆరు ఎకరాల పొలం దక్కించుకోవాలని పథకం వేశాడు. 2022లో తన స్నేహితులు నాగరాజు, మునిరాజాలతో కలిసి దంపతులపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. చౌడేపల్లి పోలీసులు...
    261 Views
  • మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
    మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలు ఫాతిమా టైలరింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంటికి వచ్చి చూడగా, తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ. లక్షకు పైగా నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు...
    254 Views
  • స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.
    రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ (EU) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి. వి. నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె-1 డిపో ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగినా, పాత బస్సులు మరియు...
    299 Views
  • అన్నమయ్య జిల్లా: 'జలధార' విజయంపై కలెక్టర్‌కు పవన్ ప్రశంసలు..
    అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కలెక్టర్ తన ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను వివరించారు. కేవలం ఐదు నెలల్లోనే భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణ వంటి ఫలితాలను పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు...
    354 Views
  • కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
    భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుల వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని, దేశాభివృద్ధికి కుల నిర్మూలన అత్యవసరమని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొన్ని వర్గాల ఆధిపత్య ధోరణిపై ఆయన...
    262 Views
  • మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.
    మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ మంగళవారం ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత ద్వారా రైతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్వహించిన రైతు సమావేశంలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు ఏఎంసీ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు.
    297 Views
  • కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.
    వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.   గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని...
    290 Views
  • మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
    ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేసి, కొత్త షెడ్యూల్ అమలు చేయాలని స్పష్టం చేసింది.   ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది...
    Like
    1
    311 Views