వాంకిడి కాగజ్‌నగర్ మేడిపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన

0
275

🎤కుమురం భీం (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని వాంకిడి నుండి కాగజ్‌నగర్ వెళ్లే ప్రధాన మార్గంలో, అంకుశాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మేడిపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన  హై-లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు హాజరై శంకుస్థాపన చేయగా, ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్  నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, మరియు జిల్లా కలెక్టర్ కే.హరిత గారు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేడిపల్లి హై లెవెల్ బిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ విజయవంతమైన శంకుస్థాపన మహోత్సవంలో వారితో పాటు DCC అధ్యక్షురాలు అత్రం సుగుణ గారు, సిర్పూర్ నియోజకవర్గ ఎంఎల్ఏ పాల్వాయి హరీష్ బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ గారు, AMC చైర్మన్ మంగ గారు, మండల అధ్యక్షుడు రాపర్తి మురళి గారు, వాంకిడి మండల ఉప సర్పంచ్ దీపక్ ముండే గారు, మాజీ సర్పంచ్ కాశన్న గారు, మరియు వివిధ మండల, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
BMA
Urban Heat Islands: Mobile Sensors Map City Microclimates
Official meteorological stations situated at airports fail to capture the suffocating reality of...
By JoinBMA 2026-08-22 08:01:21 0 70
Fashion & Beauty
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing Out, It’s About Being Me’
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing...
By BMA ADMIN 2025-05-21 13:58:13 0 3K
Business & Finance
Kyndryl Launches Cloud Uplift Service Across Microsoft Japan Data Centers
Enterprise technology provider Kyndryl has expanded its specialized "Cloud Uplift" modernization...
By Dunna Jessicaruth 2026-05-19 11:18:06 0 165
BMA
Press Clubs Raided Over Activist Links
Press institutions are increasingly under scrutiny by federal authorities. National...
By JoinBMA 2026-08-19 09:02:30 0 68
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:47:28 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com