Iam reporter
  • 20 Posts
  • 2 Photos
  • 1 Videos
  • Senior Reporter at RURAL
  • Studied 2nd year at Bhaskar Law college
    Class of BA.LLB
  • Followed by 5 people
Basic Info
  • Experience
    1 Year
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • అగ్నివీర్ తాండా యువకుడు
    రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో అగ్నివీర్గా ఎంపికయ్యాడు. ఆయన ఎంపికపై తాండావాసులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కృషి, గురువుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని అనిల్ తెలిపాడు. ఈ సందర్భంగా పలువురు అనిల్ కుమార్ను ఘనంగా అభినందించారు.
    0 Comments 0 Shares 343 Views 0 Reviews
  • బీఆర్ఎస్లో పలువురి చేరిక
    రామాయంపేటలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు
    0 Comments 0 Shares 296 Views 0 Reviews
  • రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
    రామాయంపేట మండలం కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, హమాలీలు లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
    0 Comments 0 Shares 326 Views 0 Reviews
  • అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట
    రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. పంట నాశనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని...
    0 Comments 0 Shares 374 Views 0 Reviews
  • రామాయంపేట: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
    రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం 'పౌరహక్కుల దినోత్సవం' నిర్వహించారు. సర్పంచ్ తార్యా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఆర్అ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటూనే చట్టాలను గౌరవించాలని సూచించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించవద్దని, బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు.
    0 Comments 0 Shares 366 Views 0 Reviews
  • కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్కెఫెడ్ డీఎం
    రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న మొక్కల కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలు రికార్డులను తనిఖీ చేసిన ఆమె, కొనుగోలు ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కల కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
    0 Comments 0 Shares 460 Views 0 Reviews
  • దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...
    రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్ హాజరై సిసి రోడ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి సర్పంచ్ మస్కురి బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు..
    Like
    1
    0 Comments 0 Shares 442 Views 0 Reviews
  • టీచర్ గా మారిన కలెక్టర్...
    మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అనంతరం వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదవాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
    0 Comments 0 Shares 446 Views 0 Reviews
  • #grama sabha,
    #grama sabha,
    0 Comments 0 Shares 418 Views 4 0 Reviews
  • కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ
    రామాయంపేటలోని కాట్రియాలలో '99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. తొలుత ముఖ్యమంత్రి సందేశాన్ని కార్యదర్శి ధనలక్ష్మి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాల అమలు తీరుపై అధికారులు సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.
    0 Comments 0 Shares 493 Views 0 Reviews
  • రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్
    రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామయంపేట తహసిల్దార్ రజనీకుమారి హెచ్చరించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. మండలం వ్యాప్తంగా ఉచిత రేషన్ బియ్యం ను ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే వారి రేషన్ కార్డులు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
    0 Comments 0 Shares 468 Views 0 Reviews
  • రామయంపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు
    రామయంపేట పట్టణంలోని పెట్రోల్ బంకులు మంగళవారం అర్ధరాత్రి దాటినా వాహనదారూలతో కిటకిటలాడాయి. పెట్రోల్ కొరత వదంతులు నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు భారీ సంఖ్యలో బంకులకు చేరుకొని ట్యాంకులను నింపుకున్నారు. ఎన్నడు లేని విధంగా అర్ధరాత్రి సమయంలోను జనం క్యూ కట్టడం చూసి బంక్ యజమానులు సైతం ఆశ్చర్యపోయారు. అటు ప్రభుత్వం పెట్రోల్ గురించి ఎటువంటి  వదంతులను నమ్మవద్దని సూచిస్తుంది.
    Like
    1
    2 Comments 0 Shares 679 Views 0 Reviews
  • హిందీ పరీక్షకు 100% హాజరు
    రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్ రజని కుమారి తెలిపారు.మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదని పేర్కొన్నారు.100% హాజరు నమోదు తో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
    0 Comments 0 Shares 311 Views 0 Reviews
  • హిందీ పరీక్షకు 100% హాజరు
    రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్ రజని కుమారి తెలిపారు.మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదని పేర్కొన్నారు.100% హాజరు నమోదు తో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
    0 Comments 1 Shares 906 Views 0 Reviews
  • కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
    రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. పూర్తిగా కంకర తేలిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నూతన రోడ్డును వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    Love
    1
    0 Comments 0 Shares 565 Views 0 Reviews
  • నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
    నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట తహసిల్దార్ రజనీకుమారి తెలిపారు.మండల వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారూ. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
    1 Comments 0 Shares 1K Views 0 Reviews
  • Warm Welcome to @Katiyala Jeevanraj!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Warm Welcome to @Katiyala Jeevanraj! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard!
    0 Comments 0 Shares 441 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com