సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు ఈవెంట్లకు ఎంపికైన నాగజ్యోతి
అనకాపల్లి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు సంబంధించి అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పీవీఎం నాగజ్యోతి సత్తా చాటారు.
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఏకంగా నాలుగు ఈవెంట్లలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో ఆమె నాలుగు విభాగాల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.

65 Views