• మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావు


    శంకర్‌పల్లి, ఏప్రిల్ 21


    దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.

    శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.

    1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.

    ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

    ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

    మరకత శివాలయం విరాళాలు అభివృద్ధికే: ప్రతి రూపాయి లెక్క చూపుతాం – ధర్మకర్త వెంకటేశ్వరరావుశంకర్‌పల్లి, ఏప్రిల్ 21 దాతలు, భక్తులు అందించే విరాళాలు పూర్తిగా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నామని, ప్రతి రూపాయికి దేవాదాయ శాఖకు లెక్కలు సమర్పిస్తామని మరకత శివాలయం ధర్మకర్త వెంకటేశ్వరరావు తెలిపారు.శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15 రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు గత ఐదు సంవత్సరాల లెక్కలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారని, వాటి సమర్పణకు మూడు నెలల గడువు కోరామని చెప్పారు. ఆలయంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.1983లో శంకర్‌పల్లికి వచ్చిన తాను, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని గుర్తించి, 2012లో గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2023 వరకు మాజీ చైర్మన్ సదానందం గౌడ్ కాలంలో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాల చెల్లింపుకే ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యంగా 2020–21లో కరోనా సమయంలో భక్తుల రాక తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి చందాలు సేకరించి ప్రతి పౌర్ణమికి అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో 2024 నుంచి ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల లేమి దృష్ట్యా గ్రామపంచాయతీ సహకారంతో 800 గజాల స్థలంలో అన్నదాన సత్రం, వసతి గదులు నిర్మించినట్లు తెలిపారు. గదుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.ఆలయం ప్రతి ఒక్కరిదని, ఎవరైనా వచ్చి స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకోవచ్చని తెలిపారు. అభిషేకం, అన్నదానం కోసం భక్తులకు రసీదులు అందజేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోరిక మేరకు లడ్డు, పులిహోర ప్రసాదంగా అందిస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, కోశాధికారి జనార్ధన్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, మాజీ వైస్ చైర్మన్ హన్మంతు, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 293 Views 0 Reviews
  • ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని ఫనిగిరి లక్ష్మీనరసింహ కాలనీ , మూసి నది లో గల స్వయంభు శివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధీనంలో జరుగుచున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షణ చేయడం జరిగినది. శివరాత్రి జాతర పురస్కరించుకొని వెంటనే మూసీ నదిలో మెట్లకు మరమ్మతులు, రేలింగు , లైటింగ్ , నీరు మరియు శానిటేషన్ అన్ని పనులు కూడా వెంటనే జరిపించాలని అధికారులకు ఆదేశించడం అయినది. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డి ఈ చందన గారు ,ఇంజనీరింగ్ ఏ ఈ పార్వతి గారు, వాటర్ వర్క్స్ మేనేజర్ గుర్నాథ్ గారు ,ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ రత్న సాయి గారు , ఎస్ఎఫ్ఏ శ్రీరాములు గారు టెంపుల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు , కాలనీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు , జగ్ భూషణ్ సింగ్ గారు , నరేందర్ రెడ్డి గారు , ప్రభు గారు , రాములు గారు , సుధాకర్ గారు , శ్రీనివాస్ గారు , బీజేపీ నాయకులు రాకేష్ గారు , అంజి గారు మరియు చాలామంది పెద్దలు పాల్గొన్నారు. 🙏🚩
    ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని ఫనిగిరి లక్ష్మీనరసింహ కాలనీ , మూసి నది లో గల స్వయంభు శివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధీనంలో జరుగుచున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షణ చేయడం జరిగినది. శివరాత్రి జాతర పురస్కరించుకొని వెంటనే మూసీ నదిలో మెట్లకు మరమ్మతులు, రేలింగు , లైటింగ్ , నీరు మరియు శానిటేషన్ అన్ని పనులు కూడా వెంటనే జరిపించాలని అధికారులకు ఆదేశించడం అయినది. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డి ఈ చందన గారు ,ఇంజనీరింగ్ ఏ ఈ పార్వతి గారు, వాటర్ వర్క్స్ మేనేజర్ గుర్నాథ్ గారు ,ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ రత్న సాయి గారు , ఎస్ఎఫ్ఏ శ్రీరాములు గారు టెంపుల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు , కాలనీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు , జగ్ భూషణ్ సింగ్ గారు , నరేందర్ రెడ్డి గారు , ప్రభు గారు , రాములు గారు , సుధాకర్ గారు , శ్రీనివాస్ గారు , బీజేపీ నాయకులు రాకేష్ గారు , అంజి గారు మరియు చాలామంది పెద్దలు పాల్గొన్నారు. 🙏🚩
    0 Comments 0 Shares 387 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com