• కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

    బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

    సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

    ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.
    కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.
    0 Comments 0 Shares 316 Views 13 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com