రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 వార్డు కొనాయపల్లి కి చెందిన మూడపల్లి నాగరాజు,నీలవ్వ

సుమారు 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిక

భారీగా తరలివచ్చిన 13 వార్డు కొనాయపల్లి ప్రజలు

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ భారీ చేరికలు కొనసాగుతున్నాయి. వేములవాడ మున్సిపల్ 13వ వార్డు కొనాయపల్లికి చెందిన మూడపల్లి నాగరాజు, నీలవ్వతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు…

ఈ సందర్భంగా కొనాయపల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువాలు కప్పి ఆహ్వానించారు…

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు…

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు…

పార్టీలో చేరిన మూడపల్లి నాగరాజు, నీలవ్వ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వేములవాడ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 వార్డు కొనాయపల్లి కి చెందిన మూడపల్లి నాగరాజు,నీలవ్వ సుమారు 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిక భారీగా తరలివచ్చిన 13 వార్డు కొనాయపల్లి ప్రజలు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ భారీ చేరికలు కొనసాగుతున్నాయి. వేములవాడ మున్సిపల్ 13వ వార్డు కొనాయపల్లికి చెందిన మూడపల్లి నాగరాజు, నీలవ్వతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా కొనాయపల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువాలు కప్పి ఆహ్వానించారు… ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు… పార్టీలో చేరిన మూడపల్లి నాగరాజు, నీలవ్వ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వేములవాడ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు…
0 Comments 0 Shares 130 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com