రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు శ్రీ రాపెళ్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్ది రెడ్డి గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు మరియు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారు హాజరయ్యారు

ఈ సందర్భంగా వారు గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యం.

అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యం.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, బిజెపికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు అని అన్నారు

అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, పార్టీ శ్రేణులు అంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు మరియు శ్రీ అల్లాడి రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ లింగంపల్లి శంకర్ గారు మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ గారు మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కృష్ణ స్వామి గారు వేములవాడ మున్సిపాలిటీ ఇంచార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీ బండ మల్లేశం, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సంటి మహేష్, ,సీనియర్ నాయకులు మల్లికార్జున్,అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిల్ మెంబర్లు,పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు శ్రీ రాపెళ్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్ది రెడ్డి గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు మరియు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యం. అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యం.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, బిజెపికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు అని అన్నారు అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, పార్టీ శ్రేణులు అంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు మరియు శ్రీ అల్లాడి రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ లింగంపల్లి శంకర్ గారు మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ గారు మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కృష్ణ స్వామి గారు వేములవాడ మున్సిపాలిటీ ఇంచార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీ బండ మల్లేశం, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సంటి మహేష్, ,సీనియర్ నాయకులు మల్లికార్జున్,అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిల్ మెంబర్లు,పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments 0 Shares 191 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com