పంచాయతీ రాజ్ చట్టానికి అనుగుణంగా పరిపాలించాలి: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా పరిపాలించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల ప్మెంట్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల సర్పంచులకు వేములవాడ పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ బీఈడీ కళాశాలలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుం డగా, బుధవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అభినందనలు తెలియజేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 1/3 కోరం ఉండేలా చూసుకోవాలని, ప్రతి ఏడాది ఆరు గ్రామసభలు నిర్వహించాలని, గత సమావేశం అంశాలు, తీర్మానాలు చర్చించాలని, ప్రస్తుత సమావేశంలో ప్లానింగ్, అమలుపై చర్చించాలని సూచించారు. మహిళల కోసం, వృద్ధులు, అనాథలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర ఆరోగ్య సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. నిధుల దుర్వినియోగం కాకుండా చూడాలని, ప్రతి అభివృద్ధి పనినీ గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే చేయాలని స్పష్టం చేశారు. అన్ని రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు.
ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు నిత్యం చేయించాలని, ఇండ్లు, వివిధ ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోని డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్లు వినియోగంలోకి తీసుకురావాలని, తడి, పొడి చెత్తను వాహనాల్లో సేకరించి, వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేయాలని సూచించారు. పొడి చెత్తను విక్రయించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తను తగలబెట్టవద్దని స్పష్టం చేశారు. దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రతి వారంలో శుక్రవారం డ్రై డేగా పాటించాలని, ఇండ్లలో మొక్కల కుండీలు, కూలర్లు, వినియోగించిన కొబ్బరి బొండాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలని తెలిపారు. మంచినీటి సరఫరా పై దృష్టి సారించాలని, ప్రతి నెలా 1, 11, 21వ తేదీల్లో ట్యాంక్ ల్లో నీటిని తీసివేసి, బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయించాలని, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి చూడాలని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ఉన్న నీటి వనరులు చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నీటి సరఫరా, రానున్న రోజుల్లో నీటి సరఫరా ఏమి కావాలో ముందుగానే అంచనా వేయాలని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు. గ్రామ బడ్జెట్ లో 10 శాతం మొక్కల పెంపకం, సంరక్షణకు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశారు. వీధి దీపాల నిర్వహణను చూసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ ఆదాయ వనరుల కేటాయింపుతో పాటుగా స్థానిక ఆదాయ వనరులు చూసుకోవాలని సూచించారు. ఇంటి, ఇతర పన్నులు వసూలు చేయాలని, వివిధ దుకాణాలు కొనసాగించేవారికి లైసెన్సులు జారీ చేయాలని, ప్రతి నూతన గృహ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వాలని తెలిపారు. వీటి ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుందని వెల్లడించారు.
శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు వివిధ మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల

0 Comments
0 Shares
153 Views
0 Reviews