ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రస్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఇందుకోసం ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు.

రాష్ట్రస్థాయిలో టీజీఎంఎస్‌ఐడీసీ హెడ్ ఆఫీసులో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టీజీఎంఎస్‌ఐడీసీలో ఎక్విప్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్‌గా సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్‌ను నియమించాలని సూచించారు.

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి ప్రతి సబ్ యూనిట్‌లో ఒకరిద్దరు బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని ఆదేశించారు.

ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్ విషయంలో హాస్పిటల్‌లో పనిచేసే టెక్నీషియన్లకు, ఎలక్ట్రీషన్లకు బేసిక్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు.

మిషన్ రిపేర్ వచ్చిన గంటలోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ సబ్ యూనిట్‌కు, హెడ్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

సూపరింటెండెంట్ నుంచి సమాచారం వచ్చిన 6 గంటలలోపల బయోమెడికల్ ఇంజనీర్ ఆ హాస్పిటల్‌ను సందర్శించి, సమస్య ఏంటో గుర్తించాలన్నారు.

మైనర్ రిపేర్లు ఉంటే హాస్పిటల్ స్థాయిలో ఒక్కరోజులోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కొత్త సిస్టమ్ ఉండాలని మంత్రి ఆదేశించారు.

మేజర్ రిపేర్లు ఉంటే మూడు రోజుల లోపల ఆ సమస్యను పరిష్కరించి, యంత్రాన్ని వర్కింగ్ కండీషన్‌లోకి తీసుకురావాలన్నారు‌.

ఒకవేళ ఏవైనా స్పేర్ పార్ట్స్ అవసరమైతే, వెంటనే సంబంధిత ఎక్విప్‌మెంట్ సప్లయర్‌కు సమాచారం ఇచ్చి దాన్ని రిపేర్‌ చేయించాలన్నారు.

ఎక్విప్‌మెంట్ పూర్తిగా ఉపయోగంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్లదేనన్నారు.

ప్రతి యంత్రం, ఫర్నీచర్ పేషెంట్లకు ఉపయోగపడేలా చూసుకోవాలని మంత్రి సూచించారు.

ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

హాస్పిటల్ స్థాయిని బట్టి, ఏ హాస్పిటల్‌లో ఏయే ఎక్విప్‌మెంట్ ఉండాలో ఒక స్టాండర్డ్ లిస్ట్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు.

ఈ కమిటీ నివేదిక ఆధారంగా అన్ని హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఇందుకోసం ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు. రాష్ట్రస్థాయిలో టీజీఎంఎస్‌ఐడీసీ హెడ్ ఆఫీసులో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్‌ఐడీసీలో ఎక్విప్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్‌గా సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్‌ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి ప్రతి సబ్ యూనిట్‌లో ఒకరిద్దరు బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్ విషయంలో హాస్పిటల్‌లో పనిచేసే టెక్నీషియన్లకు, ఎలక్ట్రీషన్లకు బేసిక్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. మిషన్ రిపేర్ వచ్చిన గంటలోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ సబ్ యూనిట్‌కు, హెడ్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సూపరింటెండెంట్ నుంచి సమాచారం వచ్చిన 6 గంటలలోపల బయోమెడికల్ ఇంజనీర్ ఆ హాస్పిటల్‌ను సందర్శించి, సమస్య ఏంటో గుర్తించాలన్నారు. మైనర్ రిపేర్లు ఉంటే హాస్పిటల్ స్థాయిలో ఒక్కరోజులోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కొత్త సిస్టమ్ ఉండాలని మంత్రి ఆదేశించారు. మేజర్ రిపేర్లు ఉంటే మూడు రోజుల లోపల ఆ సమస్యను పరిష్కరించి, యంత్రాన్ని వర్కింగ్ కండీషన్‌లోకి తీసుకురావాలన్నారు‌. ఒకవేళ ఏవైనా స్పేర్ పార్ట్స్ అవసరమైతే, వెంటనే సంబంధిత ఎక్విప్‌మెంట్ సప్లయర్‌కు సమాచారం ఇచ్చి దాన్ని రిపేర్‌ చేయించాలన్నారు. ఎక్విప్‌మెంట్ పూర్తిగా ఉపయోగంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్లదేనన్నారు. ప్రతి యంత్రం, ఫర్నీచర్ పేషెంట్లకు ఉపయోగపడేలా చూసుకోవాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. హాస్పిటల్ స్థాయిని బట్టి, ఏ హాస్పిటల్‌లో ఏయే ఎక్విప్‌మెంట్ ఉండాలో ఒక స్టాండర్డ్ లిస్ట్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అన్ని హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
0 Comments 0 Shares 307 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com