Bharat Aawaz
దీపావళి అమావాస్య సందర్భంగా 500 మందికి అన్నదానం

నందిగామలో ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఐదో నెల అన్నదాన కార్యక్రమం

నందిగామ: ఆర్యవైశ్య సంఘం, అన్నపూర్ణ సేవాసమితి – నందిగామ ఆధ్వర్యంలో దీపావళి అమావాస్య సందర్భంగా 500 మందికి అన్నదానం నిర్వహించారు. అన్నదాన వితరణ కమిటీ ఆధ్వర్యంలో ఐదో నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నందిగామ రథం సెంటర్‌లో ఘనంగా జరిగింది.

ఈ నెల అన్నదాన కార్యక్రమానికి శ్రీ నోముల మణికుమార్ – ఉషశ్రీ, శ్రీ దేవత అనంత మురళీకృష్ణ – జయలక్ష్మి, శ్రీ ఉడతా రామకృష్ణ – దివ్య దంపతులతో పాటు పలువురు గుప్త దాతలు తమ వంతు సహకారం అందించారు.

500 మందికి అన్నప్రసాద వితరణ

ఈ కార్యక్రమంలో పాదచారులు, ఆటో ప్రయాణికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, బాటసారులు, మహిళలు సహా సుమారు 500 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ వ్యవస్థాపకులు, నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేయడం ఎంతో విశిష్టమైనదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహోన్నతమైన సేవ అని పేర్కొన్నారు.

ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ మున్సిపల్ చైర్మన్ శాఖమూరి వంశీధర్ హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ఏచూరి రామకృష్ణ (రాము), కొండూరు వెంకటరావు, షేక్ ఇమామ్, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తురోజు శ్రీనివాసాచారి, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
11 Views