Bharat Aawaz
22, 23వ వార్డుల్లో ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీతో గడపగడపకు ప్రచారం.. ఇమామ్ జానీ, నాగమణిని గెలిపించాలని విజ్ఞప్తి

నందిగామ, అక్టోబర్ 25

నందిగామ పట్టణంలోని 22, 23వ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీ, 22వ వార్డు టీడీపీ అభ్యర్థి షేక్ ఇమామ్ జానీ, 23వ వార్డు అభ్యర్థి కాసర్ల నాగమణి గడపగడపకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని ప్రజలను కోరారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం...!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేశామని పేర్కొన్నారు. నందిగామ పట్టణ అభివృద్ధి కోసం టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. 22వ వార్డులో షేక్ ఇమామ్ జానీని, 23వ వార్డులో కాసర్ల నాగమణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

టీడీపీకి అండగా ఉంటాం మల్లయ్య

మయూరి హాల్ సెంటర్‌లోని 22వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తమ్మవరపు మల్లయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు కలిసి టీడీపీకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాసర్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస చారి, వడ్డెల్లి సాంబశివరావు తదితర టీడీపీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
27 Views