రోలుగుంట జడ్పీటీసీకి వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరి నామినేషన్
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీలో పోటీ వేడెక్కింది. నిన్న రోలుగుంట మండలం నుంచి యర్రంశెట్టి శ్రీనివాసరావు జడ్పీటీసీకి నామినేషన్ వేయగా, నేడు అదే స్థానానికి రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన కుంచంగి వంశీ రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో రోలుగుంట జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ నుంచే ఇద్దరు నామినేషన్ వేసినట్లు అయింది. కొంతలం గ్రామానికి చెందిన వంశీ రవీంద్ర యువనేతగా స్థానికంగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. ఒకే మండలం, ఒకే పార్టీ నుంచి ఇద్దరు జడ్పీటీసీ బరిలోకి దిగడంతో పార్టీలో చర్చ మొదలైంది. అధిష్టానం ఎవరికి బీఫాం ఇస్తుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

33 Views