Bharat Aawaz
గ్రామ దేవతా అర్చన శిక్షణ తరగతులు ఘనంగా ముగింపు జాగరణ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప దేవాలయంలో గత నెల 27న ప్రారంభమైన శిక్షణ వారం రోజుల పాటు కొనసాగింది. ముగింపు కార్యక్రమంలో కామాఖ్య బయ్యా అర్చకులు సతీష్ బవారి, మందమర్రి హరిహర దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ దేవతల విశిష్టత, అర్చకుల పాత్ర, సనాతన ధర్మ పరిరక్షణపై వారు వివరించారు. శిక్షణలో పాల్గొన్న వారికి ధర్మ జాగరణ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు. అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు స్థానికులు.
181 Views